– బోధన్ ఏసీపి శ్రీనివాస్…
రుద్రూర్, బతుకమ్మ :
క్రీడలలో గెలుపు ఓటములు సహజమని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో కేపీఎల్ ( కొత్తపల్లి లక్ష్మీప్రసాద్) మెమోరియల్ కప్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బుధవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ చేతుల మీదుగా టోర్నమెంట్ కప్ లను అందజేశారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన మిర్జాపూర్ విన్నర్ టీంకు మొదటి బహుమతి 20,111 రూ. కొత్తపల్లి శశికిరణ్ చేతుల మీదుగా అందజేశారు. రెండవ బహుమతి రుద్రూర్ రన్నర్ టీంకు 10,111 రూ. కొత్తపల్లి రవికిరణ్ చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ఏసీపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, ఎస్సై సాయన్న, టోర్నమెంట్ ఆర్గనైజర్లు రాథోడ్ శ్రీకాంత్, కొత్తపల్లి హేమంత్, దుర్కి సునీల్, డింపుల్, డి. సందీప్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

