Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 8:09 pm Posted by : ramakrishna

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

  • కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

 

భీమ్గల్, బతుకమ్మ : క్రీడల్లో  గెలుపు ఓటములు గెలుపు, ఓటములు సహజమని ఓటమి గెలుపుకు పునాది వేస్తుందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రం లో నిర్వహించిన సీ. ఏం క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలు బాబాపూర్ జట్టు, రన్నర్ భీమ్ గల్ జట్టుకు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యాన్ని ఇచ్చి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. యువత క్రీడాలను నిత్య క్రియల్లో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.