Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2024, 7:08 pm Posted by : ramakrishna

పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఏడో మహాసభలను జయప్రదం చేయండి

  • పి ఓ డబ్ల్యు నిజాంబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాధ

బతుకమ్మ, నిజామాబాద్ : ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఏడో మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాధ కోరారు.  మండలంలో ని   బోర్గంలో పీ ఓ డబ్లు 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర మహాసభలను ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 31న ఎస్వీటి నుండి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇందిరాపార్కుల బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ, ఏం లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగా, తెలంగాణ పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్ల సరిత, డబ్ల్యూ డబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి స్నేహిత, పడకల పద్మ, గోవా సరోజన, కళావతి, గంగామణి, మాధురి, సౌమ్య, హరీష పాల్గొన్నారు.