Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 5:00 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సి అభ్యర్థిగా బీసీ బిడ్డను గెలిపించండి

రుద్రూర్, బతుకమ్మ: ఎమ్మెల్సీపట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర ఈసి మెంబర్ నీరడి ఈశ్వర్ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి, ప్రశ్నించే గొంతుక ప్రసన్న హరి కృష్ణను ఎమ్మెల్సిగా చట్ట సభలకు పంపితే బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందన్నారు. కాబట్టి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో గల పట్టభద్రులు భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్యామ్, బాన్సువాడ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, గౌతం కాంబ్లే రుద్రూర్ మండల అధ్యక్షుడు దేవ్ణాల విద్యా సాగర్, పోతంగల్ మండల అధ్యక్షుడు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.