డిల్లీ, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్లపై సోమవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం ధర్మసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా.. మేం తీసుకోవాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన స్పీకర్ కార్యాలయం దీనిపై 8 వారాల సమయం కావాలని కోరింది. మరో నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం స్పీకర్ నుఆదేశించింది.