Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2024, 1:31 pm Posted by : ramakrishna

ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

– పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు…

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ లో రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్న పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు పోతేనే సంబంధిత అధికారులు స్పందిస్తారా? అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతూ ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోవడం లేదని, పక్కనే ప్రైమరీ పాఠశాల ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయంటున్నారు. అదేవిధంగా  పంట పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న ఇనుప రాడ్డు పూర్తిగా ఒక వైపునకు వంగి ఉందని, ఇనుప రాడ్డుకు విద్యుత్ తీగలు ఉన్నాయన్నారు. గాలులు వీచిన సమయంలో విద్యుత్ తీగలు ఒకదానికి మరొకటి తగిలి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తీగలకు ఆనుకుని ఉన్న చెల్ల కొమ్మలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Will you respond only if you lose your life?