వెల్మల్ – ఆలూరు రోడ్ ను ఇలాగే వదిలేస్తారా..?

నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి రోడ్డును రిపేర్ చేశారు. కానీ ఈ ఏడాది వర్షా కాలం రాకముందే వర్షాలు పడడం వలన  మళ్లీ గుంతలు ఏర్పడి, రోడ్ పూర్తిగా దెబ్బతింది. ప్రతిరోజూ వందలాది మంది ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయితే ఇప్పుడు రోడ్డంతా గుంతలతో నిండి ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ పూర్తిగా పగిలిపోవడంతో వర్షపు...