బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలకు కృషి చేస్తా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   రాజంపేట, బతుకమ్మ :  రాజంపేట మండలంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పలు బాధిత కుటుంబాలను గురువారం పరామర్శించారు. మండలంలోని బసవన్నపల్లి,ఆర్గొండ, కొండాపూర్, గుండారం, సిద్దాపూర్, ఎల్లారెడ్డిపల్లి, ఎల్లారెడ్డి పల్లి తండా గ్రామాలలో ఇటీవల ప్రమాదాల బారిన పడి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉండి ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హాయంలో...