Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 12:18 pm Posted by : ramakrishna

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

శనంగి రాజరాజేశ్వర గుడి నిర్మాణానికి రూ. 51,000 విరాళం అందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

ఎల్లారెడ్డి, బతుకమ్మ  : ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల, వెల్లుట్లపేట, వెంకటపూర్ గ్రామాలు కలిసి నిర్మించుకుంటున్న నూతన శనంగి రాజరాజేశ్వర ఆలయ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని  మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయ నిర్మాణం కోసం రూ. 51,000 విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ తన  ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులను మేమెప్పుడూ ఆదరిస్తామన్నారు. శనంగి రాజరాజేశ్వర దేవాలయ నిర్మాణానికి అందించిన ఈ సహాయం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణకు తమ గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు యమ రాజయ్య, పెంట అంజయ్య, మాజీ జెడ్పీటీసీ సామెల్, మాజీ ఎంపీటీసీ సుతారి సాయిలు, మాజీ ఉప సర్పంచ్ రాజా గౌడ్, భాస్కర్, నీరుడి హనుమాడ్లు, ఎల్లప్ప, బొగ్గుల సాయిలు, మాసుల రమణ, దాసరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.