జీజీహెచ్ రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చేనా?
కృష్ణమాలకొండరెడ్డి బాధ్యతలు స్వీకరణపై సంశయాలు? ప్రమోషన్ వదులుకోవడానికే సుముఖమా? నేడు ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరణ మళ్లీ ఇంచార్జి పాలనలోనే జీజీహెచ్ పక్షం రోజుల తర్వాత నియామకాలకు ఉత్తర్వులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి (సూపరింటెండెంట్) కృష్ణమాలకొండరెడ్డి నియమితులై రెండు రోజులు గడిచాయి. కానీ ఆయన విధుల్లో చేరుతారా లేదా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి. ఉస్మానియా మెడికల్ కళాశాలలో కార్డియాలజీ ప్రొఫెసర్ గా ఉన్న డా. కృష్ణమాలకొండరెడ్డిని పదోన్నతిపై వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి...