నేటి నుంచి భూభారతి రెవెన్యూ చట్టం అమలు?
అంబేద్కర్ జయంతి రోజు ప్రజలకు అంకితం హైదరాబాద్, బతుకమ్మ : ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతం లో కలిపినట్లు అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్...