హైదరాబాద్,బతుకమ్మ: హిల్ట్ స్కాంను సాక్ష్యాధారాలతో నిరూపించగలని, ఒక వేళ నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కు దుమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని, తాను హిల్ట్ స్కాంను నిరూపిస్తే మంత్రి ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అలాగే తన వద్ద ఆధారాలతో అసెంబ్లీలో కూర్చుంటానని సవాల్ విసిరారు. కాగా, రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం జరుగుతోందని రెండు వారాలుగా బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.ఈ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే.