Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2025, 1:17 pm Posted by : ramakrishna

కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే  చంపేస్తారా..?

కేసీఆర్ నుంచి  ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా..? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం దోపిడీపై  రాజలింగమూర్తి పోరాడారు. కేసీఆర్ నుంచి  ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు‘. రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు.  న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా..? అని మంత్రి వ్యాఖ్యనించారు. .  మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. కేసీఆర్ పై న్యాయ పోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్ కు రక్షణ కల్పిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవతకవలపై కేసు వేసిన  నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురికావడం రాష్ట్రం సంచలనంలో రేపిన విషయం తెలిసిందే.