దళిత మహిళకు ఇప్పటికైనా న్యాయం జరిగేనా..?
జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి గ్రామ దళిత మహిళ శ్రావంతి కుటుంబానికి గత ఆరు నెలలుగా ఎదురవుతున్న సామాజిక బహిష్కరణ అంశంపై చివరకు అధికారులు స్పందించారు. గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) పేరుతో ఈ కుటుంబాన్ని గ్రామస్తులు సామాజికంగా దూరం పెట్టి, ఒంటరిగా జీవించాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దళిత నాయకులు బంగారు సాయిలు, రవి, ఎంపీజే నాయకులు షేక్ హుస్సేన్, డా. సజ్జాద్‌లు గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకుని స్థానిక పోలీసులకు...