Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:51 pm Posted by : ramakrishna

జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగేనా ?

 

. . . జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్, ఎఐసీసీ కార్యదర్శి బేటి

 

. . . కేసీ వేణుగోపాల్ హమీ ఏమైందన్న జీవన్ రెడ్డి

 

జగిత్యాల, బతుకమ్మ :

 

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారని, ఈ నెల 25న తన అనుచరులతో సమావేశం కావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. మంగళవారం జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ అది శ్రీనివాస్ లు బేటి అయ్యారు. తన నివాసానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,విప్ అది శ్రీనివాస్ ఎదురెళ్లి స్వాగతం జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని చెప్పారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బుజ్జగింపులకు దిగివచ్చినట్లు కనిపించలేదు.

 

Will Jeevan Reddy remain in Congress?

 

ఆయన మీడియా ముందుకు వచ్చి ఎఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఇచ్చిన హమీలకు దిక్కులేదని, కోత్త హమీలు ఏమిటని రూస రూసలాడారు.  ఈ నేపథ్యంలో బుదవారం పార్టీ క్యాడర్ తో మీటింగ్ ఖాయమేనని చెప్పాలి. కాంగ్రెస్ పార్టికి జీవన్ రెడ్డి షాక్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.