Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 8:31 pm Posted by : ramakrishna

ఇల్లు ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తారా

గ్రామ సభలో అధికారులను నిలదీసిన మహిళలు

 

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారికి ఇల్లు మంజూరు చేయకుండా ఇల్లు ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తారా అంటూ మండలంలోని గోపాల్ పేట గ్రామ మహిళలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. శుక్రవారం మండల కేంద్రం గోపాల్ పేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసభాసగా కొనసాగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేవంటూ అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అధికారులు తమ ఖాళీ స్థలాల వద్ద ఫోటోలు తీసుకుని వెళ్లారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో ఎందుకు రాలేవని మహిళలు అధికారులను ప్రశ్నించారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఓ ఇద్దరు వృద్ధ మహిళల ఇండ్లు పూర్తిగా కూలిపోయి ప్రభుత్వ పాఠశాలలో నివాసం ఉంటున్నారని, అలాంటి వారికి ఇల్లు మంజూరు చేయకుండా భవనాలు ఉన్న వారికే చేయడం ఎంతవరకు సమంజసం అని, ఇంద్రమైండ్ల లబ్ధిదారుల సర్వే ను మళ్ళీ సర్వే జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు. దీంతో అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో గ్రామస్తులు తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ గ్రామ సభలో ఎలాంటి గొడవలు జరగకుండా ఎఎస్సై ఉమేష్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని రత్నం,  ఎంపీడీవో ప్రభాకర్ చారి, మండల వ్యవసాయ అధికారి, గిర్దావార్ మహమ్మద్,  పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య, గ్రామస్తులు,తదితరులు ఉన్నారు.