Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 5:27 pm Posted by : ramakrishna

పంచ ముఖి సంఘం అభివృద్ధికి తోడ్పాటునందిస్తా

 

. . . 6 వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పంచ ముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని 6 వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ పంచ ముఖి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంఘం భవనంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల 6 డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన స్రవంతి రెడ్డి, పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి నారాయణ రెడ్డి, స్వర్ణ లత లను శాలువ పూల మాలతో ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మిద్దె రవికుమార్, దారం పోతన్న లు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. సంఘం వరకు సీసీ రోడ్డు వేయాలని కోరారు.

 

Will contribute to the development of the Panchamukhi community
Will contribute to the development of the Panchamukhi community

 

పంచముఖి మున్నూరు కాపు సంఘం తరఫున పదోన్నతి పొందిన సభ్యులను,  పదో తరగతి, ఇంటర్ లలో ప్రతిభ చాటిన సభ్యుల పిల్లలను సన్మానించనున్నామని మొదట గౌరవించుకోవలసిన బాధ్యత తమపై ఉన్నందున, ఈ ఉద్దేశంతోనే పదోన్నతి పొందిన చిట్టి నారాయణరెడ్డి, నగుర్త స్వర్ణ లత- రాజేందర్ లను సన్మానించామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆరో డివిజన్ లో భారీ మెజారిటీ అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. డివిజన్ అభివృద్ధితో పాటు ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లతో మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం వరకు సిసి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యేలా చూస్తాననన్నారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం ఐక్యత బాగుంటుందని తాను విన్నానని, ఈ రోజు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసిన పంచముఖి మున్నూరు కాపు సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కర్క రమేష్, గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్, ముత్యం, సహాయ కార్యదర్శులు రఘునందన్, జగసంద్రపు లక్ష్మీ నర్సయ్య, సభ్యులు డాక్టర్ రవీందర్, రాజకిషన్, తోట నరేష్ , రాజేందర్, లింబాద్రి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.