ధర్పల్లి హెడ్ మాస్టార్ పై చర్యలు తీసుకునేనా?
నిజామాబాద్, బతుకమ్మ : ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గణజ్యోతిరాణిపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న గణజ్యోతిరాణి చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెల్సిందే. ఈ నెల 3న ఆర్జెడి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎంఈవో సేవ్ లా విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ తనిఖీలలో పాఠశాలలో పది క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. 300 మంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి గాను 45 కిలోలకు...