ఏసీబీ సోదాలతో రవాణా శాఖలో వసూళ్ళు ఆగేనా?
రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు తనిఖీలలో వాహనాలను వదిలేస్తున్న వైనం నిబంధనలకు విరుద్దంగా ఆర్టీఏ కార్యాలయం వద్ద దుకాణాలు ఏజంట్లతో పనులు కానిచ్చేస్తున్న అధికారులు చెక్ పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్ళు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం (ఆర్టీఏ) పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కొత్త చర్చకు దారి తీసింది. దాదాపు పుష్కరకాలం తర్వాత నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ సోదాలు జరిగాయి. దశాబ్ధ కాలం గడిచిన ఇప్పటి...