Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 10:49 am Posted by : ramakrishna

పక్షుల విక్రయ కేంద్రాలలో ఆటవి శాఖాధికారుల తనిఖీలు

 

. . . యానిమల్ లవర్ షాప్ సీజ్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పక్షుల విక్రయ కేంద్రాలలో ఆటవి శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆటవి శాఖ అనుమతులు లేకుండా, పశు సంవర్ధక శాఖ ధ్రువీకరణ పత్రాలు లేకుండా పెంపుడు పక్షులు, అడవి జంతువుల విక్రయాలు సాగుతున్నాయని సమాచారంతో నిజామాబాద్ ఎఫ్ డి ఓ సుధాకర్, ఎప్ ఆర్ ఓ సంజయ్ గౌడ్, రాధిక ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు.

 

Wildlife department officials inspect bird sales centers నగరంలోని మాలపల్లి, గోల్ హనుమాన్, బోధన్ రోడ్ లోని పక్షుల విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. మాలపల్లి లోని అనిమల్ లవర్ షాప్ లో ఆటవి పక్షులు 4, చిలుకలు 28, ర్యాండ్ ఎజాస్ 3, టైటర్ బర్డ్ 9, కానర్ 6, ప్లానెట్ 3 లను స్వాధీనం చేసుకున్నారు. యానిమల్ లవర్ షాప్ ను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా పక్షులను విక్రయిస్తున్న నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

Wildlife department officials inspect bird sales centers