భర్తను హత్య చేసిన భార్యకు జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భర్తను గొంతు నుమిలి హత్య చేసిన భార్యకు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ మూడవ అదనపు సేషన్స్ జడ్జి ఆశాలత  బుధవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు... నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామానికి చెందిన ముక్కల సాయిలు, రేఖ భార్యాభర్తలు వీరికి పదిహేడేళ్ల కుమారుడు,పదిహేనేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యపై అనుమానం,నిత్యం శారీరక,మానసిక చిత్రహింసలకు గురిచేసేవాడు.రోజు మద్యం తాగివచ్చి,మద్యం మత్తులో భూతులు తిడుతు మానసిక ప్రశాంతలేకుండా చేసేవాడని భావించిన భార్య భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుని 11 ఎప్రిల్,2024 రాత్రి...