Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:39 pm Posted by : ramakrishna

భర్తను హత్య చేసిన భార్యకు జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భర్తను గొంతు నుమిలి హత్య చేసిన భార్యకు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ మూడవ అదనపు సేషన్స్ జడ్జి ఆశాలత  బుధవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు… నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామానికి చెందిన ముక్కల సాయిలు, రేఖ భార్యాభర్తలు వీరికి పదిహేడేళ్ల కుమారుడు,పదిహేనేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యపై అనుమానం,నిత్యం శారీరక,మానసిక చిత్రహింసలకు గురిచేసేవాడు.రోజు మద్యం తాగివచ్చి,మద్యం మత్తులో భూతులు తిడుతు మానసిక ప్రశాంతలేకుండా చేసేవాడని భావించిన భార్య భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుని 11 ఎప్రిల్,2024 రాత్రి పదకొండు గంటల సమయంలో మద్యమ్మత్తులో నిద్రిస్తున్న భర్తను రెండు చేతులతో గొంతు నులిమి హత్యచేసింది.చీరతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సేషన్స్ కోర్టు, ఇతర దృవీకరించుకున్న పత్రాలు,వస్తుగత సాక్ష్యం ను పరిగణలోకి తీసుకుని ముద్దాయి మక్కల రేఖ తన భర్తను హత్య చేసిందని నిర్ధారిస్తు హత్య నేరంకుగాను ఆమెకు జీవిత కారాగార శిక్ష,సాక్ష్యాలను తారుమారు చేసినందున సెక్షన్ 201 ప్రకారం ఏడేళ్ళ కఠిన జైలుశిక్ష విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి ఆశాలత తీర్పులో పేర్కొన్నారు.