భర్త చేతిలో భార్య హతం
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : భార్యాభర్తల మధ్య గొడవలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆర్య నగర్ కు చెందిన నరేష్, నికితలు భార్యాభర్తలు. కులవృత్తి చేసే కాసరం నరేష్ కు అతని భార్యకు మధ్య ఇటీవల కాలంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరు గొడవపడగా ఆవేశంతో నరేష్ భార్య నిఖితపై చేయి చేసుకున్నాడు. కిందపడిన నికిత(40) అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు...