Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 10:23 pm Posted by : ramakrishna

భర్త చేతిలో భార్య హతం

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : భార్యాభర్తల మధ్య గొడవలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆర్య నగర్ కు చెందిన నరేష్, నికితలు భార్యాభర్తలు. కులవృత్తి చేసే కాసరం నరేష్ కు అతని భార్యకు మధ్య ఇటీవల కాలంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరు గొడవపడగా ఆవేశంతో నరేష్ భార్య నిఖితపై చేయి చేసుకున్నాడు. కిందపడిన నికిత(40) అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు నికిత చనిపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు సమాచారం అందగానే నాలుగవ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నగరంలోని అర్సపల్లి చెందిన నికితకు కొన్ని సంవత్సరాల క్రితం నరేష్ తో వివాహం జరిగిందని తెలిసింది. వారికి ఇద్దరు పిల్లలు.. ఈమేరకు కేసు నమోదు చేసినట్టు నాలుగవ టౌన్ ఇన్చార్జి ఎస్సై సుస్మిత తెలిపారు.