భర్త చేతిలో భార్య హతం

ఎడపల్లి, బతుకమ్మ : కుటుంబ కలహాల కారణంగా భర్త భార్యను హత్య చేసిన ఘటన ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్, ఆసియా బేగం(40) భార్యాభర్తలు. గురువారం సాయంత్రం వారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపానికి గురైన హుస్సేన్ తన భార్య ఆసియా బేగం తలను గోడకు బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన భార్య మృతి చెందిందని గమనించి భయపడ్డ హుస్సెన్,...