Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 7:40 pm Posted by : ramakrishna

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

కామారెడ్డి, బతుకమ్మ : ప్రియుడితో కలిసిన భర్తను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. హత్యకు గల కారణాలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 16న గాంధారి శివారులోని చద్మల్ రోడ్డులో గుర్తుతెలియని శవం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేరెల్ కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన నరేష్, నవనీత దంపతులు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పని చేసుకునే క్రమంలో ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఓరోజు బడా పహాడ్ దర్గా వద్దకు వెళ్దామని ముగ్గురు కలిసి రెండు బైకులపై వెళ్లారు. అక్కడ ఇద్దరూ క్లోజ్ గా ఉండటం గమనించిన నరేష్.. భార్య నవనీతను వేధించడం ప్రారంభించాడు. దీంతో నరేష్ అడ్డు తొలగించుకునేందుకు మరోసారి బడా పహాడ్ వెళ్దామని బయలు దేరారు. తిరిగి గాంధారి చేరుకోగానే వైన్ షాపులో మద్యం తీసుకుని చద్మల్ రోడ్డులో నరేష్ కు ఫుల్ గా తాగిపించారు. మద్యం మత్తులో ఉన్న నరేష్ ను కిందికి తోసేసి ఛాతిపై దాడి చేసి హత్య చేశారు. శవాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రల్ బంక్ లో పెట్రోల్ తీసుకొచ్చి కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాద్ లో వీరిద్దని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి బైక్, మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కీలక సమాచారం అందించిన నేరెల్ యువకుడితో పాటు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.