Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 12:46 pm Posted by : ramakrishna

భార్య భర్తలపై దాడి చేసి 70తులాల బంగారం చోరీ

హుజూరాబాద్ లో కలకలం రేపిన ఘటన

వెబ్ న్యూస్,బతుకమ్మ :  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో  ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీచోరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హూజూరాబాద్ లోని ప్రతాపవాడలో ప్రతాప రాఘవరెడ్డి నివాసముంటున్నాడు. అతని ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దంపతులపై  కత్తితో దాడి చేశారు. ఇంట్లోని 70 తులాల బంగారం, రూ.8లక్షలు దొంగలించి పరారయ్యారు. ఈదాడిలో మహిళ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈభారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది.