Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 9:26 pm Posted by : ramakrishna

భార్య పై కర్రతో దాడి.. భర్త పై కేసు నమోదు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన రామగర్ల లావణ్య కు ఏడు సంవత్సరాల క్రితం రామగర్ల శేఖర్ తో వివాహం జరిగింది గత కొన్ని రోజుల నుండి శేఖర్ మద్యానికి బానిసై ఇంట్లో తనను, తన పిల్లలని పట్టించుకోకుండా లావణ్యను వేధిస్తున్నాడని ఇట్టి బాధ భరించలేక లావణ్య శేఖర్ మామ అయిన శివానంద్ కు చెప్పి బాధపడగా ఈ నెల నాలుగో తారీఖు నాడు గాంధీ చౌక్ వద్ద శివానంద్ మరియు లావణ్య ఇద్దరు కలిసి అక్కడ ఉన్న శేఖర్ తో మాట్లాడి సర్ది చెబుదామని వెళ్లగా శివానంద్ శేఖర్ ను సముదాయిస్తుండగా వినకుండా లావణ్యను శేఖర్ కట్టేతో కొట్టి తలపై గాయపరిచినాడని లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.