కొడవలితో భర్తను నరికి చంపిన భార్య అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : మాంసం కూర వండలేదని అడిగినందుకు భర్తను హత్య చేసిన భార్యని పోలీసులు సోమవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. కామారెడ్డి పట్టణం లోని గోసంగి కాలనీలో ఈ నెల 25 న రాత్రి 10 గంటల సమయంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో శివాజీ అక్కడికక్కడే మరణించాడు. శివాజీ అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదుతో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు...