Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 10:02 pm Posted by : ramakrishna

ఎమ్మార్పీయస్ సన్నాహక సభకు తరలిన వితంతు, వికలాంగ,వృద్దులు

వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి, ఎం యస్ పీ, వి హెచ్ పీ యస్ అనుబంద సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 13న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల, చేయూత పింఛన్ దారుల మహా గర్జన విజయవంతానికి గాను శుక్రవారం నిజామాబాద్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి వేల్పూర్ మండల వికలాంగులు, వితంతువులు, వృద్దులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎమ్మార్పీయస్ వ్యవస్థపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా నిర్వహించిన ఈ సన్నాహక సమావేశానికి మండల ఎమ్మార్పీ యస్ ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ మాదిగ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు చెందిన చేయూత వికలాంగులు, వృద్దులు, వితంతువులు వాహనాలపై బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమం లోవర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాదిగ,అధికార ప్రతినిధి సుమన్ మాదిగ,సీనియర్ నాయకులు బాల కిషన్ మాదిగ,రాజేష్ మాదిగ  పాల్గొన్నారు.