భూ భారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిరికొండ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి' (ఆర్.ఓ.ఆర్) చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందల్వాయి మండల కేంద్రాలలోని రైతు వేదికలలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంపై, అందులో పొందుపర్చిన ...