Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 7:29 pm Posted by : ramakrishna

హెచ్ఐవి పై అవగాహన కోసం విస్తృత ప్రచారం

దోమకొండ, బతుకమ్మ : హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం చేస్తుందని కామారెడ్డి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాధిక అన్నారు. మంగళవారం దోమకొండ లో సంచార వాహనపు ఎల్ఈడి చిత్ర ప్రదర్శనతో అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ… హెచ్ఐవి ని వారించడానికి అవగాహన ముఖ్యమని భావించి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశామన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో పది రోజులపాటు సంచార వాహనం ద్వారా హెచ్ఐవి, ఎయిడ్స్ ,సుఖ వ్యాధులపై ఎల్ఈడి తెరపై చిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారు ఎల్ఈడి చిత్ర ప్రదర్శనను తిలకించి, అవగాహన కల్పించుకోవాలని కోరారు. 2030 నాటికి హెచ్ఐవిని నిర్మూలించే దిశగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రభు కిరణ్, సిహెచ్ సి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి యాదగిరి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిపిఎం చల్లా సుధాకర్, ఐ సి టి సి కౌన్సిలర్ మేక నాగరాజు, వై ఆర్ జి కేర్ లింకు వర్కర్ స్కీం డి ఆర్ పి గర్దాస్ సుధాకర్, రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు బుర్రి రవికుమార్, బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, లింకు వర్కర్ బాలకిషన్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీవిద్య, అవుట్రిచ్ వర్కర్లు సాయి, మీనా రెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మెర మహాదేవ్, దేవరగట్టు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.