ఇది ఎవరి నిర్లక్ష్యం సార్లూ..?

బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు సమస్యకు పరిష్కారం దొరికేనా..? బతుకమ్మ ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఈ మధ్యన వర్షాలు భారీగా కురుస్తుండడంతో బస్టాండ్ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది.దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో నీటి నిల్వ చేరడం పట్ల టోల్ ప్లాజా నిర్లక్ష్యమా..?ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమా..అనేది సందిగ్ధం నెలకొంది.ఇప్పటికైనా దీనికి బాధ్యులు ఎవరో స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిలిచిన నీటిని డ్రైనేజీలో కలిపే విధంగా చూడాలని...