Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 5:30 pm Posted by : ramakrishna

ఇది ఎవరి నిర్లక్ష్యం సార్లూ..?

  • బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు
  • సమస్యకు పరిష్కారం దొరికేనా..?

బతుకమ్మ ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఈ మధ్యన వర్షాలు భారీగా కురుస్తుండడంతో బస్టాండ్ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది.దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో నీటి నిల్వ చేరడం పట్ల టోల్ ప్లాజా నిర్లక్ష్యమా..?ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమా..అనేది సందిగ్ధం నెలకొంది.ఇప్పటికైనా దీనికి బాధ్యులు ఎవరో స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిలిచిన నీటిని డ్రైనేజీలో కలిపే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.లేనిపక్షంలో ఆర్టీసీ బస్టాండ్ ను,టోల్ ప్లాజా యాజమాన్యాన్ని ముట్టడిస్తామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టోల్ ప్లాజా యంత్రాంగం గాని ఆర్టీసీ యాజమాన్యం గాని తేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు కోరారు.