Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 7:25 pm Posted by : ramakrishna

షార్ట్ సర్క్యూట్ తో హోల్సేల్ ఏజెన్సీ దగ్ధం

  • రూ.4.50 లక్షల ఆస్తి నష్టం

 

మద్నూర్, బతుకమ్మ: షార్ట్ సర్క్యూట్ తో హోల్సేల్ ఏజెన్సీ దుకాణం కాలిపోయి ఆస్తి నష్టం జరిగింది. మద్నూర్ మండలం కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన కొండ వార్ రాకేష్ విద్యుత్ ఘాటంతో హోల్సేల్ ఏజెన్సీ శుక్రవారం కాలిపోయి ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. సుమారు రూ.4.50లక్షల ఆస్తి నష్టం జరిగింది. అన్ని మాపక పోలీసులు రూ. 3లక్షల నగదును, 15 తులాల బంగారం మంటలను చల్లార్చి బయటకు తీసి ఏజెన్సీ యజమానికి అప్పగించినట్లు అగ్నిమాపక శాఖ పోలీసులు పేర్కొన్నారు. మంటలను ఆర్పడంతో చుట్టుపక్కల నివాసం వారు, గ్రామస్తులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మంటలను చల్లార్చి ఆస్తిని కాపాడినందుకు అగ్ని మాపక శాఖ పోలీసులకు స్థానికులు, ప్రజలు అభినందించారు. ఎస్సై విజయ్ కొండ,అగ్ని మాపక శాఖ పోలీసులు నర్సింలు, హరీష్, రానా ప్రతాప్, రాజు, దిగంబర్ పాల్గొన్నారు.

Wholesale agency burnt down due to short circuit