డీసీసీ పగ్గాలు ఎవరికి?

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టిన నేపథ్యంలో డీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం తప్పనిసరి అనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టిన తరుణంలో.. ఆయా జిల్లాల్లో ప్రక్షాళన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన...