Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 6:54 pm Posted by : ramakrishna

లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించింది ఎవరు..?

 రాజంపేట్ లో వైద్య ఆరోగ్యశాఖ టీం విచారణ
రాజం పేట్ , బతుకమ్మ: ఇటివల లింగనిర్ధారణ పరీక్షలు వెలుగు లోకి వచ్చిన రాజం పేట్ లో వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టింది. లింగనిర్థారణ పరీక్షలకు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సహకరించినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా వైద్యారోగశాఖ బృందం యం.సి.హెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజంపేట మండలంలో సందర్శించారు. రాజంపేట గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన బల్ల రవి వారి సోదరి ఆశ వర్కర్ అయిన రాజశ్రీ లింగ నిర్ధారణ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ సిబ్బంది సోమవారం విచారణ చేపట్టినట్లు మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. ఆశా కార్యకర్తగా గత ఎన్ని రోజుల క్రితం నుండి పనిచేస్తుండగా లింగ నిర్ధారణ పరీక్షలకు ఆమెకు గల సంబంధం వంటి వివరాలపై గ్రామంలో పలువురు వ్యక్తుల నుండి సమాచారం సేకరించినట్లు ఆమె తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం వివరాలు సేకరించామని ప్రతి ఒక్క ఆశ కార్యకర్తను, ఏఎన్ఎం లను విచారణ చేపట్టడం జరిగిందని తదుపరి అంశాలు పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ విచారణలో ఒక ఆశ వర్కర్ గా అలాగే గ్రామ కారొబార్ విధులను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పూర్తి నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అందచేస్తామని తెలిపారు.