Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 6:13 pm Posted by : ramakrishna

ఎక్కడ చూసినా శివ నామస్మరణే

 

. . . ఆలయాలలో లైటింగ్, విద్యుత్ దీపాలతో కనువిందు

 

. . . భక్తి శ్రద్ధలతో రెండు రోజుల పండగను జరుపుకుంటున్న భక్తులు

 

. . . పలు ఆలయాలలో అన్న సత్రాలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

మహా శివరాత్రి పండగ అంటేనే వారం రోజుల నుండి ఇల్లును శుద్ధి చేసుకుని ఇంట్లో ఉన్న పరికరాలను శుభ్రపరిచి ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని ఇందల్వాయి రాజన్న శివాలయం, గన్నారం రాజరాజేశ్వర స్వామి శివాలయ మందిరం, తదితర గ్రామాలలో శివాలయాలలో ఇతర దేవాలయాలలో శివరాత్రి పండగను భక్తులు భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి ఆలయాలకి వెళ్లి పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకుంటున్నారు. పండగ సందర్భంగా ఆలయాలలోకి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణాలు, హర హర మహాదేవ శంభో శంకర అంటూ కీర్తనలు, భజనలు, జానపదాలు, ఆట, పాటలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. పలుచోట్ల అన్న సత్రాలు నిర్వహిస్తున్నారు. ఇందల్వాయి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు అన్న సత్యాన్ని నిర్వహించారు.

 

Wherever you look, the name of Shiva is remembered.

 

వివరాలలోకి వెళితే లక్ష్మీనరసింహస్వామి భక్తులు మొదటి రోజే పొద్దున నుండి ఉపవాసం ఉండి సాయంత్రం దేవుడికి నైవేద్యం సమర్పించి ఉపవాసన విరమింప చేస్తారు. రాజరాజేశ్వర స్వామి శివయ్య భక్తులు మొదటి రోజు నుండి రాత్రి జాగారం చేసి రెండో రోజు ఉదయం శివయ్యకు నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించి ఉపవాసాన్ని విరమింప చేసుకుంటారు. శివయ్య అంటే కోరిన కోరికలను తీర్చే బోలా శంకరుడుగా కొలుస్తామని భక్తులు చెబుతున్నారు. పురాణాలలో సైతం శివయ్య అంటే బోలా శంకరుడని, కోరిన కోరికలను వెంటనే తీర్చేవాడిగా చూపిస్తుంటాయని పేర్కొంటున్నారు.

 

 

Wherever you look, the name of Shiva is remembered.