Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 1:06 pm Posted by : ramakrishna

రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేశారు

Wherever Revanth went, he was attacked

. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తారు

. వ్యతిరేకత ఉందనే ఎన్నికలకు వెళ్లడం లేదు

. ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లను గట్టు మీద పెట్టేశారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి చేతుల మీదుగా అర్వింద్ సభ్యత్వం స్వీకరించారు. రైతులకు రుణమాఫీ, బోనస్, కళ్యాణ లక్ష్యితోపాటు బంగారాన్ని మరిచారన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం  లేదని, ఒక వేళ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కేస్తారన్నారు. మంచిప్ప ప్రాజెక్టు ఫైనల్ కాకముందే రూ.2100 కోట్ల విలువైన పైపులను కొనుగోలు చేశారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు లెటర్ హెడ్ కొట్టించుకోలేదని, మంత్రి పదవి వస్తేనే లెటర్ హెడ్ కొట్టిస్తానని బహిరంగంగా చెబుతున్నాడన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బోనస్ తోపాటు జిల్లాలకు ఇంటిగేటెడ్ స్కూల్ ఎప్పుడు వస్తుందో సుదర్శన్ రెడ్డి పట్టించుకోవాలని ఆయన సూచించారు.

ఏం చేశావని పాదయాత్ర

పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తిమీద ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేశారని పాదయాత్ర చేస్తాడని అర్వింద్ ప్రశ్నించారు. ఆయనకు చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలకాలని ప్రజలకు సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చావని పాదయాత్ర చేస్తావా అని అన్నారు.  సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.