. . . ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బిజెపి ఎక్కడ ఉందో అక్కడ అభివృద్ధి, విశ్వాసం ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. బుధవారం పలు డివిజన్లలో చేపట్టిన భూమి పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినప్పటికీ ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏం సాధించి పెట్టారని రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారని ఇందూరు ఆయన గుర్తు చేశారు. తాను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచి రెండు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ, తనకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఫండ్ కింద ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మేయర్ పీఠం మాదే అని, విజయం తమదే అని, మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి ఐదు సీట్లు కూడా రావని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఎక్కడ అని, అలాగే 2000 పెన్షన్ దారులకు 4000, 4000 పెన్షన్ దారులకు 6000 చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తమ దగ్గర ఖజానా లేదని చేతులు ఎత్తేయడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని అన్ని సర్వేల్లో చెబుతున్నాయని మరి ముఖ్యంగా కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో కూడా అదే వెలువడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి మేయర్ అయ్యాక ఇప్పుడు చేపడుతున్న అభివృద్ధి కాకుండా రెట్టింపు స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రజలు ఎదురుచూస్తున్న డ్రైనేజీ వ్యవస్థను కోటి రూపాయల ఫండ్ తోనే కాకుండా ఇతర నిధులతో శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. గత రెండు మూడు రోజులుగా పలు డివిజన్లలో పర్యటిస్తున్న తనకు ప్రజలు విశేషంగా మద్దతు తెలుపుతున్నారని కొనియాడారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అనడం తనకు హిందువుల పై ఉన్న అగౌరవాన్ని ప్రదర్శిస్తుందని కావున రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి అండగా నిలబడి బిజెపి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టియుఎఫ్ఐడిసిలో మంజూరు చేసిన డివిజన్ కి కోటి రూపాయల అభివృద్ది పనులలో భాగంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ బుధవారం 45 వ డివిజన్, 22 వ డివిజన్, 6 వ డివిజన్, 23 వ డివిజన్, 25 డివిజన్, 24 వ డివిజన్, 7 వ డివిజన్, 26 వ డివిజన్, 40 డివిజన్, 41వ డివిజన్, 42 వ డివిజన్, 47 డివిజన్, 48 డివిజన్ ప్రాంతాలలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ పాల్గొన్నారు.

