వరద బాధితులపై  కార్పొరేట్ ప్రేమ ఎక్కడ..?

సెలబ్రేటిలకు వరద కష్టాలు కనిపించవా..? ప్రభుత్వ సహాయంతో గట్టెక్కెనా..? పేదలను పట్టించుకునే వారేరి స్థానికంగానే ఆదుకుంటున్న లోకల్స్   నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణలో అల్పపీడనం కారణంగా కురిసిన కుంభవ`ష్టి సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అందులో కామారెడ్డి జిల్లాకు మాత్రమే 120 కోట్ల తక్షణ మరమ్మత్తులకు కేటాయించింది. తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.11,500 చొప్పున, గ్రామాలలో రూ.5 వేలు కేటాయించడం జరిగింది. రోడ్ల మరమ్మత్తులు,...