Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 11:09 pm Posted by : ramakrishna

వరద బాధితులపై  కార్పొరేట్ ప్రేమ ఎక్కడ..?

  • సెలబ్రేటిలకు వరద కష్టాలు కనిపించవా..?
  • ప్రభుత్వ సహాయంతో గట్టెక్కెనా..?
  • పేదలను పట్టించుకునే వారేరి
  • స్థానికంగానే ఆదుకుంటున్న లోకల్స్

 

నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణలో అల్పపీడనం కారణంగా కురిసిన కుంభవ`ష్టి సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అందులో కామారెడ్డి జిల్లాకు మాత్రమే 120 కోట్ల తక్షణ మరమ్మత్తులకు కేటాయించింది. తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.11,500 చొప్పున, గ్రామాలలో రూ.5 వేలు కేటాయించడం జరిగింది. రోడ్ల మరమ్మత్తులు, రహదారుల పునర్నిర్మాణం, కాలువల పూడికలు తొలగింపులకు మాత్రమే నిధులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో నష్టం గురించి మాత్రమే అంచనా వేశారు కానీ ఎలాంటి పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజలే స్వచ్చందంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. చోటామోటా లీడర్లు వరద బాధితులకు బియ్యం, పప్పులు, ఇతర కిరాణా సామాగ్రి అందజేశారు. అయితే ఒక్కొక్క కుటుంబానికి ,ఒక్కొక్క వ్యధను నింపిన భారీ వర్షంపై సెలబ్రేటీలు కార్పొరేట్ సంస్థలు స్పందించకపోవడంపై చర్చ జరుగుతుంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కార్పొరేట్ సంస్థలకు సేవ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని, ప్రక`తి విపత్తులు సంభవించినప్పుడు ప్రాంతాలను బట్టి స్పందిస్తారనే చర్చ మొదలయింది. ఉమ్మడి రాష్ట్రంలో తుఫాన్ లు, వరదలు వస్తే సహాయానికి కార్పొరేట్ సంస్థలు, సెలబ్రేటీలు కోట్ల రూపాయలు వెచ్చించేవి. దత్తత తీసుకున్న దాఖలాలున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విపత్తు వస్తే పట్టించుకునే వారు లేరని కార్పొరేట్ సోషల్ రెస్పన్సిబులిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ విడుదల ఏవి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Where is the corporate love for flood victims?

ఉత్తర తెలంగాణను ఆగస్టు చివరి అంకంలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తుఫాన్ అంటే తెలియని ప్రజలకు మొదటిసారి దాదాపు 4 దశాబ్ధాల తర్వాత క్లౌడ్ బరస్ట్ (కుంభవ`ష్టి) వర్షం కురిసింది. దానితో ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, అసిఫాబాద్ జిల్లాలో గజగజవణికిపోయాయి. దక్కన్ పీఠభూమిపై ఉన్న ఉత్తర తెలంగాణలో కొండలు, కోనలు, చెరువులు, వాగులు, వంకలు మినహా పెద్దగా నదులు లేవు. గోదావరి, మంజిరా, హరిద్రా నదులు మినహా మిగిలిన ఆచూకీ లేదు. అయితే ఆగస్టు చివరి వారంలో కురిసిన వర్షం 40 సెం.మీలు కావడంతో చెరువులు, వాగులు, వంకలు తెగిపోయాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో లక్షల క్యూసెక్కులు నదుల పాలయ్యాయి. పోచారం ప్రాజెక్టు ముప్పును ఎదుర్కొంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో గ్రామాలు నదుల ముంపును ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం రెండు రోజులకు ఆలస్యంగా తేరుకుని సహాయ చర్యలకు పిలుపునిచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి  ఏరియల్ సర్వే నిర్వహించగా జిల్లా ఇంచార్జి మంత్రితో పాటు ఇతర జిల్లాలోనూ మంత్రులు పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

Where is the corporate love for flood victims?

ఉత్తర తెలంగాణలో సెలబ్రేటిలకు , కోటిశ్వరులకు కొదవ లేదు. మిలియనర్లుగా ప్రసిద్ది చెందిన వ్యక్తులుగా చాలా మందే ఉన్నారు. వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారున్నారు. సినిమా రంగంతో పాటు కార్పొరేట్ సేవలు అందించిన వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వివిధ ప్రాంతంలోనూ స్థిరపడ్డా వారు ఉన్నారు. కానీ దయార్థ హ`దయంతో స్పందించిన వారే లేదు. కేవలం ఎన్నికల్లో నిలబడడానికి తమ సొంత చరిష్మాను పెంచుకోవడానికే సహాయం చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో స్వచ్చంద సంస్థలు, స్థానిక గ్రామాస్తులు చందాలు వేసుకుని వరద బాధితులను పట్టించుకుంటుంటే సెలబ్రేటిలు స్పందించకపోవడం ఏమిటని చర్చ జరుగుతుంది. ఇప్పట్లో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు లేవని అందుకే సెలబ్రేటిలు కోటిశ్వరులు స్పందించడం లేదన్న చర్చ జరుగుతుంది. కానీ స్థానికులు స్పందిస్తున్న తీరు ఇంకా ప్రజల్లో మానవత్వం ఉందని నిరూపిస్తోంది. ప్రధానంగా గ్రామాలలో కులాలకు, మతాలకు అతీతంగా సేవలందిస్తు మానవ సేవయే మాదవ సేవ అనిపిస్తున్నారు.

Where is the corporate love for flood victims?