Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:09 pm Posted by : ramakrishna

రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?

 

. . . ప్రాణాలు పోతున్నా స్పందించని కిస్టోన్ రోడ్డు నిర్మాణ సంస్థ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రహదారులపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వేగ నియంత్రణ, మలుపులు, నిర్మాణాలు, ప్రమాదకర మలుపుల గురించి తెలియక తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రుద్రూర్ – వర్ని 765 /డి జాతీయ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మండలంలోని అక్బర్ నగర్ వెళ్లే రహదారి మూలమలుపు వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు చాలా ప్రమాదాలు జరిగాయని, ప్రాణాలు పోయినా కూడా కిస్టోన్ రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అనేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. మూలమలుపుల వద్ద హెచ్చరికలు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనాలు అదుపుతప్పి, బోల్తా పడి ప్రాణ నష్టం సంభవిస్తోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు స్పందించి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.