Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 5:06 pm Posted by : ramakrishna

దివ్యాంగులకు ఇస్తానన్న హామీలు ఎక్కడ..?

–వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు సాయిలు

ఇందదల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో సోమవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ ప్రస్తుతం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దివ్యాంగులకు ఏ ఒక్క అయినా ఏ ఒక్కటైనా హామీని నెరవేర్చిందా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దీనిని తమ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని, దివ్యాంగులకు ప్రత్యేకంగా బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటివరకు అమలు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే వివంగులకు 4000 నుండి 6 వరకు పెన్షన్లు తక్షణమే అమలుపరుస్తానాని హామీ ఇచ్చారన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ పైన దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మేనిఫెస్టో హామీల ప్రకారం అతి త్వరలోనే తమ సమస్యలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగనున్నట్లు హెచ్చరించారు.