. . . టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్
. . . టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం
కామారెడ్డి, బతుకమ్మ :
మహిళా హక్కులు ఎప్పుడైతే సంపూర్ణంగా అమలు అవుతాయో అప్పుడు దేశం కచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుందని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజంలో భర్తలందరూ కూడా భార్యలను గౌరవించాలని, వ్యక్తిగతంగా తనకు తాను పురుషులు మారాలని, అలా మారినప్పుడే మహిళలు హక్కులు పొందగలుగుతారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళ శ్రామిక జిల్లా కన్వీనర్ రేణుక మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల ఎంత చదువుకున్న వివక్ష పోవడం లేదని వివక్ష పోవాలంటే చదువు, ఆర్థిక స్వలంబన ఉంటే కొంత మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు మాట్లాడుతూ జ్యోతిబా, సావిత్రిబాయి పూలే ల నిరంతర కృషి వల్లనే భారత దేశంలో విద్య అనేది ప్రారంభమైందని, దాన్ని అనుసరించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్త్రీ విద్యకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. అదే విధంగా మహిళా హక్కుల కోసం తయారుచేసిన హిందూ కోడు బిల్లు కోసం అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి దేశంలోనే మొట్టమొదటి మహిళా హక్కుల కోసం రాజీనామా చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే బాలికల మీద వివక్ష చూపించకుండా చట్టాలు రావాలని, బాలికల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు రూప్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ఉన్నప్పుడు ఎవరి హక్కులు వాళ్లకు అందుతాయని, స్వార్థం ఉన్నప్పుడు ఒకరి హక్కులను ఇంకొకరు నాశనం చేస్తారని, కాబట్టి సామాజిక బాధ్యత చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో వనిత రెడ్డి గురుకుల ప్రిన్సిపాల్ స్వప్న, ఇర్ఫాన్ బాను, గంగా జ్యోతి, సంధ్య, యశోద బాయి, రాణి, సునీత, వసంత, రమ్య శ్రీ, వెన్నెల, సాయి గౌతమ్, బాలయ్య, ఏసురత్నం పాల్గొన్నారు.