Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2024, 3:32 pm Posted by : ramakrishna

నీటి కష్టాలు తీరేది ఎప్పుడో..?

  • కరుణించండి అంటూ కాలనీ వాసుల ఆవేదన
  • పట్టించుకోని అధికారులు

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో రోజు రోజు త్రాగు నీటి సమస్య పెరుగుతున్నే ఉన్నాయి.ఉమ్మడి మండలంలో అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీటిని ఇస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారే ఫలితం మాత్రం శూన్యంగానే ఉందని తెలుస్తుంది. అందుకు నిదర్శనంగా మండల కేంద్రంలోని శ్రీనివాస్ రెడ్డి కాలనీ, ఇస్లాంపుర కాలనిలో మిషన్ భగీరథ నల్లలు ఏర్పాటు చెసి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఒక్క బొట్టు కూడా నీళ్లు రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులుకు తమ గోడును విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

When will the water problems end?