కమిషనర్ లాగిన్ తీసుకునేదెప్పుడు.. పర్మిషన్లు ఇచ్చేది ఎప్పుడు?

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన ఇంటి నిర్మాణాల కోసం పర్మిషన్లు రాక దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. కొత్తగా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్ ఇప్పటి వరకు లాగిన్ తీసుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులకు లాగిన్ ఇవ్వలేదు. దాంతో దాదాపు 150 నుంచి 120 దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన అన్నీ రకాల రుసుములు చెల్లించినా పర్మిషన్లు రాకపోయే సరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కార్తీకమాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో...