- న్యూరో ఫిజిషియన్ పరీక్షించకుండానే
- పేషెంట్ వద్ద ప్రిస్కిప్షన్ ఫీజు వసూల్
- ఫిజిషియన్ స్థానంలో పేషెంట్ కు టెస్టులు
- విజయ హాస్పిటల్ లో దారుణం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్ కు చేదు అనుభవం ఎదురయింది. నవీపేట్ మండలం నాళేశ్వర్ కు చెందిన లక్ష్మీ అనే మహిళ తనకు నరాల నొప్పితో ఖలీల్ వాడిలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలొ ప్రముఖ న్యూరోఫిషియన్ విష్ణువర్ధన్ వొజ్జెల వద్దకు ట్రీట్ మెంట్ కోసం వచ్చింది.

సోమవారం కావడంతో ఆసుపత్రి రోగులతో కిటకిటలాడింది. వచ్చి రాగానే లక్ష్మీకి డాక్టర్ కన్సల్టెషన్ ఫీజును రూ.400 వసూల్ చేశారు. డాక్టర్ విష్ణువర్ధన్ ను కలిసేందుకు ముందుగానే ప్రిస్కిప్షన్ పై పలానా టెస్టులు చేయించుకోవాలని రిసెప్షనిస్టు రాయడంతో ఆమె ఖంగుతిన్నది. తాను ఫీజు చెల్లించిన డాక్టర్ తనను పరీక్షించకున్నాటెస్టులు ఎలా చేయించుకునేది అని నిలదీసింది. ఆమెకు తోడుగా వచ్చిన యువకుడు ఈ విషయంలో రిసెప్షనిస్టును ప్రశ్నించగా టెస్టులకు డాక్టర్ ఎందుకు నేనే రాస్తానని దబాయించింది. ఇందుకు ఇలా చేస్తారని ప్రశ్నించగా వారిని బయటకి గెంటేసే ప్రయత్నం చేశారు. దానితో బాధితులు హిందూ వాహిని ప్రతినిధులను సంప్రదించారు.

వారు ఈ విషయంపై ఆసుపత్రి న్యూరో ఫిజిషియన్ విష్ణువర్ధన్ ను వివరణ కోరేందుకు యత్నించారు. ఆయన అందుబాటులో లేకపోగా అక్కడే ఉన్న మరో వైద్యుడు డా.సురేష్ కుమార్ వివాదంను పెద్దగా చేయవద్దని, సర్దుకుపోవాలని చెప్పడం కొసమెరుపు. న్యాయవాది పిల్లి శ్రీకాంత్, రెంజల్ బుజ్జిలు అక్కడకు చేరుకుని డాక్టర్ ను నిలదీయడంతో నీళ్ళునమిలారు. డాక్టర్ పరిశీలించకుండానే రిసెప్షనిస్టు రూ.2 వేల నుంచి 3 వేల వరకు టెస్టులను ఎలా రాస్తారని ప్రశ్నించడంతో సీనియర్ వైద్యులు వొజ్జెల సురేష్ కుమార్ గొడవ సద్దుమనిగిపించారు. అయితే బాధితులు మాత్రం నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.జయశ్రీకి విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విషయంపై విచారణ జరిపి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
