Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 9:07 am Posted by : ramakrishna

కలల కప్ అందిన వేళ..

వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం ఫైనల్ ల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి వన్డే  వరల్డ్ కప్ ను  కైవసం చేసుకుంది.ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ 87, స్మతి మంధాన 45 పరుగులతో రాణించారు. ఛేదనలో సౌతాఫ్రికా జట్టు తడబడింది. భారత బౌలర్ల దాటికి 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్ట్ 101 పరుగులతో పోరాడిన ఫలితం దక్కలేదు. దీప్తిశర్మ 5/39, షెఫాలి వర్మ 2/36 వికెట్లను పడగొట్టారు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దీప్తి శర్మకు ఫ్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన నాలుగో జట్టుగా భారత్ జట్టు చరిత్ర లిఖించింది.

శుభాకాంక్షలు తెలుపుతున్నా సెలబ్రిటీలు

చాంపియన్ గా నిలిచిన మహిళా జట్టుకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా ప్రకటించింది. దీన్ని ప్లేయర్లు, కోచ్ లు సహాయక సిబ్బందికి అందజేస్తామని వెల్లడించింది. హర్మన్ ప్రీత్ బృందంను అభినందిస్తూ ’ఎక్స్ ‘వేదికగా సినీ సెలబ్రిటీలు,  ప్రముఖులు పోస్ట్ లు పెడుతున్నారు. దేశం గర్వించేలా చేశారంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


When the dream cup arrives..