Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 4:40 pm Posted by : ramakrishna

మురికి కాలువలు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలి

 

. . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాలనీలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలని సీపీఎం బెజ్గం సుజాత అన్నారు. సోమవారం భగత్ సింగ్ కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలో గత కొన్ని రోజులుగా మురికి కాలువలు చెత్త పేరుకుపోయిందన్నారు. మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త పేరుకుపోయి   పైప్ లైన్ ద్వారా వచ్చే నీళ్లల్లో పురుగులు వస్తున్నాయన్నారు. వాటి ద్వారా అక్కడున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కావున మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలందరిని ఏకం చేసి స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రాజు, సాయిలు, హాయ్మతి రిజ్వానా, రబ్బాని, రజినీ, కవిత, సుమ, తదితరులు పాల్గొన్నారు.

 

When should sewers be cleaned?